భీమవరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారధ్యం యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భీమవరంలో సారధ్యం యాత్ర ఏర్పాట్ల పైన జిల్లా బిజెపి కార్యాలయంలో నాయకులతో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చర్చించి పలు సూచనలు ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మాధవ్ జిల్లా పర్యటనకు వస్తున్నందున పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చూడాలని బిజెపి నాయకులను శ్రీనివాస వర్మ ఆదేశించారు.