అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట గ్రామం వద్ద శ్రీ శక్తి పథకం విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఒకటిన్నర గంటల సమయంలో పాపంపేట వద్ద రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకం సూపర్ గా సక్సెస్ కావడం జరిగిందని శ్రీ శక్తి పథకం విజయోత్సవ సభను నేడు పాపంపేటలో నిర్వహించడం జరిగిందని వందలాది మంది మహిళలు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని ఇటువంటి విజయోత్సవాలు వైసీపీ నేతల చెవుల్లో మారి మోగిపోతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.