మైనార్టీల సమావేశాన్ని జయప్రదం చేయండి: కాంగ్రెస్ 28వ తేదీ విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీల సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ వైస్ ఛైర్మన్ పగిడాల అమన్ తెలిపారు. ఆదివారం ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు.