సంగారెడ్డి జిల్లా హత్నురా మండలం దౌల్తాబాద్ ప్రైమరీ స్కూల్ భవనం రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలతో బుధవారం కూలిపోయింది. బుధవారం సెలవు దినం కావడంతో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దౌల్తాబాద్ ప్రైమరీ స్కూల్ భవనం అధికారులు పరిశీలించి నూతన భవన నిర్మాణానికి కృషి చేయాలని స్థానికులు గ్రామస్తులు కోరుతున్నారు. ప్రైమరీ స్కూల్ భవనం శిథిలావస్థలకు చేరడంతో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కూలినట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.