మహబూబ్ నగర్ లోని తొలి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థినిని రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహబూబ్ నగర్ కు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రెడ్డి హాస్టల్లో ఈ క్యాంపస్ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తొలి విద్యార్థిని చూపిన ప్రతిభను జితేందర్ రెడ్డి అభినందించారు