జమ్మికుంట పట్టణంలోని పాత అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోలుగురి సదయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది బిజెపి నాయకులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాన్ని కాల్చి కాలుతో తన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేస్తూ పథకాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో దాన్ని ఓర్వలేక బిజెపి పార్టీ నాయకులు చిల్లరగా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు.