అల్లూరి ఏజెన్సీలో ఒకేరోజు రెండు చోట్ల గర్భిణి లు ప్రసవ వేదన అనుభవించారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంకిటిముల పంచాయతీలో రోడ్డు సౌకర్యం లేక కాలినడకన గర్భిణీ ప్రయాణం చేస్తూ ఆసుపత్రికి చేరుకోగా, బలపం పంచాయతీలో రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణీ ని కోరుకొండ ఆసుపత్రికి డోలిమోత ద్వారా తరలించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. స్వాతంత్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్న మన్యంలో అనేక మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులు లేని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించాలని వారు కోరుతున్నారు.