అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం సమీపంలో ఈనెల 14న లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న బి.సంతు(37) కుటుంబానికి చెడ్డ పేరు తెస్తోందని ఆమె మరిది మురళీధర్, మృతురాలి కుమార్తె అనూష, చిన్న కుమార్తె (15) కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు SP తుహీన్ సిన్హా తెలిపారు. మృతదేహాన్ని బాటజంగాలపాలెం కారులో తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు.