పేదల కడుపు నింపిన, ప్రాణాలు నిలిపిన ఘనత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందని పలువురు వైసీపీ నేతలు కొనియాడారు.ఆయన 16వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం చీరాల క్లాక్ టవర్ సెంటర్లోని వైయస్ విగ్రహానికి వారు క్షీరాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు.జీవించినంత కాలం పేదలకు మంచి చేయాలని తపించిన వైయస్సార్ కు మరొకరు సాటి రారన్నారు.ఆయన కుమారుడు జగన్ కూడా అదే బాట అనుసరిస్తున్నారని చెప్పారు.