రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 82 లక్షల మంది అర్హులైన వారు ఉంటే 52 లక్షల మందికి మాత్రమే డబ్బులు పడినట్లు ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. 30లక్షల మందికి ఇవ్వలేదన్నారు. శుక్రవారం కడప జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల అచ్యుతాపురం మండలం ఆవరాజవరం, చీమలాపల్లి, ఇరువాడ గ్రామాల్లో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు.