మద్దిపాడు: అబద్ధపు హామీలతో అధికారం చేపట్టడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని మాజీ మంత్రి మేరుగ నాగర్జున అన్నారు. మద్దిపాడులో ఆదివారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి మేరుగ నాగర్జున నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేక విఫలమయ్యారని మాజీ మంత్రి నాగార్జున విమర్శించారు. చంద్రబాబు మాసాలను ప్రజల్లో ఎండగడతామన్నారు.