TDP ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియపరుస్తూ ఇంటింటికి వెళ్లామని సూచించారు. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది.