జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలోని పామాయిల్ తోటలో పనిచేస్తున్న రమేశ్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంకు చెందిన రమేశ్ శుక్రవారం రైతు తోటలో కత్తితో పామాయిల్ గెలలు కోస్తుండగా, కత్తి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. రమేశ్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు