ధర్మవరం పట్టణంలో అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి అప్పు కట్టలేదని చేనేత వ్యాపారి సాకే రమణ పై దాడి చేసిన మొదటి ముద్దాయి సాకే రాజశేఖర్ ను అరెస్టు చేసినట్టు ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ గురువారం తెలిపారు. కొద్దిరోజుల క్రితం సాకే రాజా మా నాన్న చర్ల తో కలిసి చేనేత వ్యాపారి రమణ పై అమానుషంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి రాజా అనుచరులను అరెస్టు చేశారు. రాజా పరారీలో ఉండగా ఈరోజు అరెస్టు చేసినట్టు డిఎస్పీ తెలిపారు.