ఆసిఫాబాద్ సర్కార్ దవాఖానాలో ఆదివారం రాత్రి జ్వరంతో ఓ గిరిజన యువకుడు మృత్యువాత పడ్డారు. ASF మండలం గుడిగుడికి చెందిన ఆత్రం రాంషావ్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతిచెందాడని తుడుండెబ్బ జిల్లా అధ్యక్షులు విజయ్ ఆరోపించారు. సోమవారం ఆసిఫాబాద్ ఆసుపత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. చనిపోయిన మృతుడి కుటుంబానికి 50లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.