కాలేశ్వరం ప్రాజెక్టు చిన్న పగులు పడితే ప్రాజెక్టు కూలిపోయిందని అనడం విడ్డూరంగా ఉందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ కరీంనగర్ లో శుక్రవారం విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు హైదరాబాద్ కు ఎలా తీసుకువెళ్తున్నారని, ఆకాశం నుంచి తరలిస్తారా అని ఎద్దేవా చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నిర్మాణాలతోనే తరలిస్తారు కదా మరి కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉండగానే కరెంటు పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కరెంటు పోతుందో కూడా తెలవదు అంటూ హేళన చేశారు.