మంచిర్యాల జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండు కుండల మారింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువనున్న గోదావరిలోకి నీటిని వదలడంతో మంచిర్యాలలో కొన్ని ప్రాంతాలు జలమయమైపోయాయి. అందులో భాగంగానే ముందస్తు చర్యగా గోదావరి నది తీరంలో ఉన్న మాత శిశు హాస్పిటల్ లో ఉన్న బాలింతరాళ్లను, గర్భిణీ స్త్రీలను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వాహనాల ద్వారా తరలించారు. వర్ష ప్రభావిత ప్రాంతమైన గోదావరి నదిని, మాత శిశు ఆసుపత్రిని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ సందర్శించారు