జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ముడావత్ పూర్ణ నివాసముండే ఇంట్లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మండలంలోని నసరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించే పూర్ణ ఆత్మహత్యకు పాల్పడడానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఆమె భర్త పాత్లావత్ గోప్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే కావడం గమనార్హం. వారికి ఇద్దరు కూతుళ్లు కలరు. భార్యాభర్తల మధ్య కలహాలే పూర్ణ ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.