కనిగిరి పట్టణంలోని జల వనరులను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరిలో చెరువులు, వాగులు, వంకలు ఆక్రమాలకు గురికాకుండా ఉండేందుకు పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీని ఎమ్మెల్యే గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి కనిగిరిలోని చెరువులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై కనిగిరిలో చెరువులు, వాగులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.