ఈరోజు వరంగల్ నగరంలోని సత్యం కంప్యూటర్స్ లో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక నరేంద్ర మోడీపై మరియు బండి సంజయ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ కేవలం 15 నుండి 20 శాతం మందికి మాత్రమే ఇస్తుందని అంతేకాకుండా 2 యూనిట్ల ఉచిత విద్యుత్ కేవలం ఐదు శాతం మందికే అందిస్తున్నారని ఆరోపించారు.