ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు అనుచరులు కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి జిల్లా వైస్సార్సీపీ ఉపాధ్యక్షులు మాసపల్లి సాయికుమార్ పార్టీ కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు వైస్ చైర్మన్లు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.