గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆరబోసిన మొక్కజొన్న పూర్తిగా తడిసిపోవడంతో గురువారం మధ్యాహ్నం 2:40 రైతు జేఏసీ నాయకులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ ద్వారా తడిసిన మొక్కజొన్నను ఎంఎస్పి ధర 2400 తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతు జేఏసీ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు.