జిన్నారం – జంగంపేట ప్రధాన రహదారిపై రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం రాయిని చెరువు వరద ఉధృతి తగ్గడంతో రహదారిపై వేసిన ముళ్ల కంచెలను అధికారులు తొలగించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు నీరు రహదారిపై ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రహదారిపై బ్రిడ్జిను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.