వినాయక చవితి పండగ సందర్భంగా వెలుగోడు పట్టణంలో నెలకొన్న వివాదం కారణంగా పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న సంకేతం ఇచ్చేందుకు పోలీసులు పట్టణ పురవీధుల గుండా కవాతు నిర్వహించారు. వెలుగోడు పట్టణంలో ఆత్మకూరు డిఎస్పిరామాంజజీ నాయక్ ఆద్వర్యంలో సుమారు 200 మంది పోలిసులుకవాతు నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశంలో అన్ని మతాలను ఒకే విధంగా గౌరవించాలని ప్రజలకు తెలియపరుస్తూ కవాత్ కొనసాగించారు. ఈ సందర్భంగా డిఎస్పి రామాంజి నాయక్ మాట్లాడుతూ... ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన, అల్లర్లు సృష్టించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.