స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ వారి తుపాకీ కి ఎదురు నిలిచి గుండె చూపిన ధైర్యశాలి, ఆంధ్రుల ఆవేశానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక టంగుటూరు ప్రకాశం పంతులునీ, ఆయన తెగువ, ధైర్యం, పోరాట స్ఫూర్తి, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. శనివారం టంగుటూరి 153 వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.