నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. శుక్రవారం నగర శివారులోని ఖానాపూర్ వద్దగల గోదాంలలో నిల్వ ఉంచిన యూరియాను ఆయన జిల్లా వ్యవసాయ అధికారి గోవిందుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాకు ఇప్పటికే 6700 మెట్రిక్ టన్నులు వచ్చిందని ఇంకా నాలుగు వేల టన్నులు మనకు రావాల్సి ఉందన్నారు. 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా నిల్వ ఉందన్నారు. ప్రతిపక్షాలు యూరియాకు సంబంధించి అనవసరంగా రాజకీయం నాయకులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.