ప్రకాశం జిల్లా కొండపి మండలం నర్సింగోలు గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో సాగుతున్న కోడిపందాల స్థావరాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. డ్రోన్ ఎగురుతూ కోడిపందాలు ఆడుతున్న వైపు వెళ్లిన క్రమంలో కోడిపందాలు ఆడుతున్న వారు అక్కడి నుంచి తమ దిచక్ర వాహనాలు వదిలి పరారయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 44 ద్విచక్ర వాహనాలు ఏడు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు ఆడుతున్న వారు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారని ద్విచక్ర వాహనాలన్నిటిని సీజ్ చేసి కొండపి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు.