Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 28, 2025
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మద్దతుదారులైన కొందరు మైనార్టీ నేతలు నిన్న విమర్శలు చేయడంతో, కావలి మైనార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తమ ఎమ్మెల్యేపై ఎవరైనా విమర్శలు చేస్తే సహించేది లేదని, తమను చూసి సైలెంట్గా ఉన్నారని రెచ్చిపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. మర్యాదగా మాట్లాడాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది.