రామారెడ్డి మండలం పోసానిపేట శివారులో పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఎస్ఐ లావణ్య తెలిపిన వివరాలు ప్రకారం పోసానిపేట శివారులో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేశారు. ముగ్గురిని పట్టుకుని కేసు నమోదు చేసి వారి నుంచి రూ.19,920 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లావణ్య వెల్లడించారు. పోలీసు స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాట ఆడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు, గ్రామస్తులకు ఎస్ఐ లావణ్య హెచ్చరించారు.