కుందుర్పి మండలం ఎన్ వెంకటాంపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగప్ప గత బుధవారం అదృశ్యమయ్యాడు. హరిజన నాగప్ప కళ్యాణ దుర్గం లోని ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో హరిజన నాగప్ప అదృశ్యమైనట్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.