అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని తెలికి గ్రామంలో పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలికి గ్రామ శివారులో ఓ రహస్య ప్రాంతంలో కంపచెట్లలో కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులు సమాచారం అందింది. ఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో కలిసి దాడులు చేసి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.34.300 రూపాయలు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.