సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిక్షయ్ పోషణ యోజన కింద టీబీ రోగులకు పోషక విలువలు గల సరుకులను సాలూర ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు. సాలూర మండల 9 మంది టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని ప్రతినెల సుమారు రూ.500 విలువ గల సరుకులను అందజేస్తామని డాక్టర్ తెలిపారు. సరియైన సమయంలో టీబీను గుర్తించి చికిత్స చేస్తే టీబీ నివారించవచ్చని ఆయన తెలిపారు.