వేల్పూరు తహసిల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఆకస్మిక తనిఖీ చేశారు. రెవిన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.నాయబ్ తహసిల్దార్ శ్రీకాంత్, కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. వివరాలను అధికారుల వద్ద సేకరించారు. సిబ్బంది హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ పెట్టాలని నాయబ్ తాహసిల్దార్ శ్రీకాంత్ ను ఆదేశించారు.