మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1979-80 సంవత్సర ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా 45 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వీరి గురించి అప్పటి విద్యా విధానం స్నేహాలు ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.విద్యార్థి దశలో స్నేహాలు ఎంతో మధురమైనవని ఆయన అన్నారు.