అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి వద్ద కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా ప్రజలు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. అదేవిధంగా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్డును నిర్మించామని 25 లక్షల రూపాయల ఆరోగ్య భీమాను కూడా ప్రజలకు అందించబోతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.