ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలోని ఓ పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ.55,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతోనే ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.