అనంతపురం జిల్లా పామిడి మండలంలోని కాళాపురం గ్రామ శివారులో సతీష్ కుమార్ రెడ్డి అనే యువకుడు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి చెందిన సతీష్ కుమార్ రెడ్డి పని నిమిత్తం పామిడికి వచ్చాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి బైక్ లో ఇంటికి వెళ్తుండగా కాళాపురం గ్రామ శివారులో అతడిని ఎవరో గొంతు కోసి హతమార్చారు. సతీష్ కుమార్ రెడ్డి బైక్ లో వెనుక కూర్చున్న వ్యక్తే గొంతు కోసి ఉంటాడని ఘటనా స్థలాన్ని బట్టి తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు