అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో అవోపా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 120 కిలోల వెండి వినాయకుడికి నైవేద్యంగా ఉంచిన వెండి నాణెం వేలం పాటలో రికార్డు ధర పలికింది. గురువారం పట్టణంలోని అమ్మవారి శాలలో పోటాపోటీగా జరిగిన వేలం పాటలో గిరిజ్, హరిత దంపతులు వెండి నాణేన్ని రూ.1.11.116 కు దక్కించుకోగా, 5 కిలోల లడ్డూ రూ.12.116 కు సుబ్రమణ్యం అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలంలో పాల్గొని అత్యధిక ధరకు పొందిన వారిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.