రైతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే యూరియా సరఫరా చేయాలని, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించాలని, పత్తి పంటకు 10,075 రూపాయలు కనీస మద్దతు ధర కల్పించాలని,నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కనీసం యూరియాను సరఫరా చేయలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు.