ప్రభుత్వం చేపట్టిన గ్రామ పాలనాధికారులకు నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి గ్రామ పాలన అధికారులు తరలి వెళ్లారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి 3 బస్సులను జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా గ్రామ పాలనా అధికారులకు నియామక ఉత్తర్వులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.