బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి ఆర్మీ అధికారులు జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమావేశమై ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ ఆర్మీలో అగ్ని వీర్ నియామకాల కోసం గతేడాది హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించినట్లు చెప్పారు. ఈసారి హనుమకొండ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు