పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడు జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తణుకు నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న తల్లి-కొడుకు బైక్ డివైడర్ను ఢీకొనడంతో తల్లి రోడ్డుపై పడిపోయి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే హైవే అంబులెన్స్ సిబ్బంది స్పందించి క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.