మెరుగైన ఆరోగ్యం కోసం, మంచి భవిష్యత్తు కోసం ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని, భారతదేశం శక్తి, భవిష్యత్తు యువతే అని.. యువతను క్రీడల వైపు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. జనాభాలో చైనాను దాటుతున్న భారత్ ఒలంపిక్, ఏషియన్ గేమ్స్ మెడల్స్ విషయంలో కొంత వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు.