కరీంనగర్ లో జాగృతి సమావేశం శనివారం నిర్వహించినట్లు జాగృతి రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరి ప్రసాద్ తెలిపారు. జాగృతి బలోపేతం కోసం కవితతో కలిసి పనిచేస్తూ, కవిత ఆదేశాలతో జిల్లాలో జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ జాగృతి మొదటి నుండి మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణతో పాటు, తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కవిత నాయకత్వంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.