పత్తికొండ పట్టణంలోని ఒక పొలంలో పురుగు మందు సేవించిఈశ్వరమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.సోమవారం సీఐ జయన్న తెలిపిన వివరాల ప్రకారం,కొండగేరికి చెందిన ఈశ్వరమ్మ తన కుమారుడితో పొలానికివెళ్లి పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది.కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకువెళ్లారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయన్న తెలిపారు.