గాంధారి మండలంలో వివిధ ప్రాంతాల్లో వాన తనిఖీలు భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై శుక్రవారం ఎల్లారెడ్డి కోర్టు మెజిస్ట్రేట్ M.సుష్మ ముగ్గురికి ఒక్క రోజు జైలు శిక్ష, రూ. 1100/- రూపాయల జరిమానా విధించినారు అని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 1. కాట్రోత్ రమేష్, 2. కుమ్మరి సాయిలు, 3. బానోత్ గణేష్ లు గాంధారికి చెందినవారీగా గుర్తించారు. అలాగే మరో 12 మందికి రూ.1,100 జరిమానా విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.