నేర ప్రవృత్తిని విడనాడకపోతే కఠిన చర్యలు తప్పవని చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు రౌడీ షీటర్లను హెచ్చరించారు.శనివారం ఆయన సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.వారి ప్రస్తుత జీవనశైలి గురించి అడిగి తెలుసుకున్నారు.సత్ప్రవర్తనతో మెలగాలని చెప్పారు.పోలీసు శాఖ వారిపై గట్టి నిఘా ఉంచిందని,ఎవరైనా అదుపుతప్పితే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు.వేటపాలెం, ఈపూరుపాలెం ఎస్సైలు జనార్ధన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.