ఈగల్ టీం బిలాస్‌పూర్- తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిదిన్నర కిలోల గంజాయిని పట్టుకుంది.బాపట్లలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ రైలులో ఎక్కిన ఈగల్ టీం చీరాల వరకు ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేసింది.ఈ క్రమంలో గంజాయి దొరికింది.ఆ బ్యాగులు కలిగిన ఇద్దరు యువకులను ఈగల్ టీం అదుపులోకి తీసుకొని చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు