అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ మహేష్ కుమార్ అర్జీదారుల నుండి సుమారుగా 165 అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పింఛన్లు, రెవెన్యూ, ఇళ్ల పట్టాల సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయని ఈ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.