కుందుర్పి మండలం కరిగానపల్లి గ్రామ శివారులోని శశి మాకులమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు దేవాలయం లోకి చొరబడి అమ్మవారి వెండి బంగారు ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. 20 తులాల వెండి ఆభరణాలు, ఒకటిన్నర తులం అమ్మవారి బంగారు తాళిబొట్టు, రూ. 6 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుందుర్పి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.